జీవన రాగం 2021

నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
 ❇️❇️❇️❇️❇️❇️
కవివరుల జాబితా
1.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.గారు
2.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
3.ఆపరాజిత్ గారు
4.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
5.సింహాద్రి వాణి గారు
6. జోషి పద్మావతి గారు
7.ఏడెల్లి రాములు గారు
8.కోరాడ గారు
9.తరణికంటి సూర్య లక్ష్మి గారు
10.కోరాడ గారు
11.కవిత వెంకటేశ్వర్లు గారు
12.దారల విజయ కుమారి గారు
13.గొర్రెపాటి శ్రీ ను గారు
14.సునంద వురిమళ్ళ గారు
15.ఆళ్ల  నాగేశ్వరరావు గారు
తెనాలి
16.గజవెళ్ళి శ్రీనివాసాచారి కాజీపేటగారు

*************
కవితాగానం
నేటి అంశం
01.09.2021
జీవనరాగం

ఎనిమిది నుండి
తొమ్మిదిన్నర వరకు
అంశానికి కవితలతో
స్పందించగలరు.

ఆ సమయంలో
ఎలాంటి
ఇతర స్పందనలు తెల్పకుండా
సహకరించగలరు.

❇️❇️❇️❇️❇️❇️
1
[01/09, 8:00 pm] +91 6281 697 982: అంశం....జీవన రాగం...01092021
శీర్షిక...... నా జీవన వేదం
*****************************
నా జీవన వేదం మరుపు రాని మెరుపుల నాదం
మరు మల్లెల మాలల మరువాల సమాహారం
తియ తియ్యని చెలమల ఊటల జంఝారావం
కమ్మని తేనియ చుక్కల చిందేసె చిరు దరహాసం

పారే గంగా యమునా జీవ నదుల పరవళ్ళ 
పాటల పల్లకిలో ప్రయాణం నా జీవన వేదం
పచ్చని పొలాల పై వీచే చిరుగాలి పరిమళం
ఎగురుతున్న సీతాకోక చిలుకల సయ్యాటకు
దరువేస్తున్న పిల్ల కాలువల నీటి జలజలారావం

అవని పైనున్న పచ్చల వనజలతారు, వొంపులు తిరిగిన గిరి సమూహాల నిమ్నోన్నతాల ప్రకృతి సౌందర్యం, కొండల పైనుండి దుముకెడు వాగులు
వంకలు, తెల్లని నురుగులతో పరుగుల ప్రణయ రాగం నా జీవన రాగం.

తెల్లని మబ్బుల్లో నల్లని కోయిల పంచమ వేద
గానం సురలోకాలనే ఉర్రూతలూగించిన చందంగా నా వేదం వీనుల విందే.

నీలాకాశంలో కలహంసల గుంపులు వయ్యారంగా
విహరించిన తీరుగా
అరుణ కిరణాలు సోకంగ విరిసిన సరసిజము మనోహరమై రంజిల్లినటుల నా జీవన రాగం
కడు రమణీయంగా కన్నుల విందే

వెండి మడుగులా నిండైన వెన్నెల వెలుగులో
కురుస్తున్న  మంచు తుంపరలు తెరలు తెరలుగా హృదయాన్ని ఉర్రూతలూగించే
కూచిపూడి నృత్యం నా జీవన వేదం

నా జీవన వేదం ప్రకృతి ప్రసాదించిన సౌందర్యం
నా జీవన రాగం ప్రపంచ మందించిన సౌరభం
ఆనందించి ఆస్వాదించే అమోఘం.

స్వీయ రచన:::కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
01092021.
2
[01/09, 8:02 pm] +91 99373 80136: కవితాగానం
తేది01092021,బుధవారం
అంశం:జీవనరాగం.
శీర్షిక:ఈ దాహం తీరనిది.
అవును ఎక్కడో కలుసుకున్నాం
ఎన్నాళ్ళగానో కలుసుకుంటూనేవున్నాం
తనవితీరటంలేదు
తనువులు కలవటంలేదు
ఇలా ఎన్నాళ్ళని ?ఎన్నేళ్ళని?
ఇలా కలస్తూనేవుందామా??
ఈ దాహం తీరనిదేనా?
ఈ మోహం వీడిపోవల్సిందేనా?
చరిత్రచెప్పిన సత్యమిదేనా?
ప్రేమకు మరణంలేదు
ప్రేమికులకు జీవనంలేదా?
ఇలా భగ్నప్రేమికులమైపోదామా?
ఈ జీవనరాగం ఏ స్వరమునాలపిస్తుందో?

ఇది నా స్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా.
చరవాణి7780594995.
3
[01/09, 8:06 pm] Aparajith: బండల బ్రతుకులు!

వేసవి తాపం తగ్గి 
చల్లని గాలులతో ఊరట 
ఆకుల గల గలలు 
ఉల్లాసంగా మనసు హేల 
రొదచేస్తూ గాలి వాన 
రోడ్లన్నీ జలమయం!
బ్రతుకులు సుడిగుండాలై 
రోడ్ల ప్రక్కన ముడుచుకుని 
పడుకున్న అభాగ్యులు!
ఆకలితో నక నకలాడుతూ 
ఒంటరి పోరాటంలో ఓడి 
జాలి కళ్ళ జీరల్లో 
కన్నీళ్ళు ఇంకిపోయి 
మోసం దగాకోరు లోకంలో 
అన్నమో రామచంద్ర!అంటూ 
పడరాని పాట్లు పడుతూ 
భవంతుల నిర్మాణంలో 
కార్ఖానాలు నడపడంలో 
హోటళ్లలో పనివాడిగా 
ఆకలి తీర్చుకొవడానికి 
చేయని పని అంటూ లేదు 
సొంతగూడు అసలే లేదు!
చాకిరీ చేసి చేసీ 
మసకబారిన కళ్ళతో 
రాజకీయాలేవీ తెలియని అమాయకులు 
నున్నటి రోడ్డుపై పరుగులెత్తే నీ కారు 
ఎన్నో గుండెల బండచాకిరీ ఫలితం 
బ్రతుకు బరువై ఎండిన కన్నీళ్ల ఎడారియై!
చదువులు ఆమడ దూరంలో 
అనుభవాల ముళ్ల కంచెలో 
దొంగే దొరై తిరిగే లోకంలో 
నిజాయతీగా నీకు పనిచేసిపెట్టే 
బానిస బ్రతుకుల చిత్తడి వాన!
వానకు వణుకుతూ నిద్రకు కరువై 
అల్లల్లాడే జీవితాలు 
ఎర్రటి తొలి పొద్దులో 
కొళిమి పక్క సమ్మెటతో 
దెబ్బ మీద దెబ్బ పడేది 
ఆయుదాల తయారీకి!
మరోప్రపంచం రహదారిపై పయనం!!

ఆపరాజిత్
4
[01/09, 8:31 pm] Thathapudi Somashekara Sharma: కవితాగానం పోటీ కొరకు 
అంశం.. జీవనరాగం 
కవితాశీర్షిక..కళ్యాణరాగం 
తేదీ..1.9.2021 బుధవారం 
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336
 
శుభ కళ్యాణ వైభోగమే
కనువిందైన కమనీయమే
మదిలో మ్రోగింది అనురాగమే
మనసంతా ఆనందసంతోషభరితమే

చూపులు కలసిన అందాల శుభవేళ
పెళ్ళిముహూర్తం పెట్టు ఆనందహేళ 
నిశ్చితార్ధమునకు నిండుమనసైనవేళ 
సుహుముహుర్తాన కనులుకలిపే వేళ 
మాంగళ్యధారణ ముహుర్తానంద వేళ 

తలoబ్రాలు సమయాన దంపతులచే వారిచేతులను తీసుకుకలగొలుపుచేసే
మధురస్పర్శను పొందే జీవనరాగహేల 
అదే....వైవాహికబంధజీవనమధుహేల 

గౌరి సగం ఈశ్వరుడు సగం
నాదవినోదమే కళ్యాణబంధం
లక్ష్మి సగం నారాయణుడు సగం
లీలావినోదమే వివాహ బంధం
విద్యావాణి సగం విధాత సగం
వినోదభరితమే వైవాహికబంధం
త్రిమూర్తుల అద్భుత కలయిక
త్రిమాతల అపూర్వ కలయిక
మన వైవాహిక జీవనరాగమే 

మ్రోగింది శుభ కళ్యాణ వీణ
మనసు నిండింది వరవధువీణ 
మదినిండా మ్రోగే సరిగమలు
మనసంతా నిండె పదనిసలు
చేయి చేయి కలిసింది ఇద్దరికీ 
హాయిహాయిగావుంది ఆఇద్దరికీ 
పసుపు పారాణితో నవదంపతులు
పుణ్యాలపంటయైనారు ఆలుమగలు 
చేతులు కలుపుతుంటే వారికుండే
వ్రేళ్ళ స్పర్శ శరీరమంతా పులకింపే 
జీవనమాధుర్యం జన్మజన్మలబంధం అనురాగబంధం మధురకళ్యాణరాగం 

హామీపత్రం
                  ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
5.
కవితాంశం:-- జీవన రాగం
కవితా శీర్షిక:-- ఫలించిన కల

ఇన్నాళ్ళూ నేనొక శిలననుకున్నాను
ఎన్నేళ్ళున్నా ఫలించని కలననుకున్నాను
మోడైవున్న నా జీవన వనంలో
ఆశల చెట్లు చిగురించవనీ,
బీడులా వున్న నా హృదయ క్షేత్రంలో
స్నేహలతల పచ్చదనాలు కనిపించవనీ
చీకటి నిండిన నాబ్రతుకు ప్రాంగణంలో
సంతోషపు వెన్నెలలు కురియవనీ
బ్రతుకు నిస్సారంగా ‌గడిపాను
నా ఆర్తిని తెలుసుకొని 
స్నేహసుధలను చిందించే నేస్తమే లేక
అర్థం లేని నాజీవితం వ్యర్థం అనుకున్నాను
శిలలో సెలయేరులా
చీకటిలో వెలుగు రేఖలా
ఎక్కడో కొన ఊపిరిని నిలుపుకొని
తొలకరిలో చిగురించే మోడులా
ప్రయత్నంతో ఫలించే బీడులా
నిస్వార్థంగా నీవు నాతో స్నేహం చేసి
శిలలా వున్న నన్ను నీ స్నేహపు ఉలితో చెక్కి,
సుందర శిల్పంగా మలిచావు
నా ఎద వీణియ మీటి జీవన రాగాన్ని పలికించావు
స్తబ్దుగా వున్న నన్ను చైతన్య స్రవంతిలా మార్చావు
నేస్తమా!
నన్ను మనిషిని చేశావు
నా జీవితానికి అర్థం కలిగించావు.

రచన:--సింహాద్రి వాణి
విజయవాడ
చరవాణి:--7569820872
6.
కవితాగానం
-----------------
తేదీ:01/09/2021
అంశం: జీవనరాగం

శీర్షిక: జీవన హేల
********************

మోద,ఖేద మయము
కష్ట,సుఖ సమ్మిళితము
నాటక,బూటక నానావిధము 
యోచనాయోజనలజీవనము
మానవజీవనమొక వైవిధ్యభరిత
సరాగ సురాగ రాగరంజితము 
ఆనంద భరిత హాసమున దొరలు
ఆనంద భైరవి రాగమే!అమితానందమే!!
కినుక కలిగిన వేళ 
కుమిలి కమలిన వేళ
కలికికైన పసి మొలకకైన 
శోకమే !అది ఆరున్నొక్కరాగమే!!
బుడిబుడినడకల బుడుతలనోట
మాటలన్నీ ఆటపాటల ఊట
నిదురబుచ్చువేళచిన్నారి ఊకుడుపాట
తల్లినోట జాలువారు జోలపాట
నవ్వించువేళ పదనిసలనవ్వులాట
విద్యనేర్చువేళపసందుగానేర్చునోపాట
జగడమాడు జాణలనోట
జాలువారు పదజాలమూ.... 
అదియునూ ఒక రాగమే!
దూషణ,భూషణ హేళనల
హాస్యాస్పద పదజాలమే!!
తికమకలురేపు తిట్లదండకమే!!!
దేవుడిచ్చిన ఈ జీవనమొక నాటకమే!
అడుగడుగునా వినిపించే జీవనరాగమే!!
        _________________
జోషిపద్మావతి 
మహబూబ్ నగర్
7.
[01/09, 9:08 pm] +91 94948 00454: కవితా గానం
*జీవన రాగం*

కలల పండగ జీవన రాగం
కలిసి వచ్చేది ఎందరికో
కలవరపాటై ఆటుపోట్లేల
సుమ శీల సౌశీల్యులకే ఈతిబాధలు

కనబడని ఎత్తుపల్లాల్లో
వెలుగును మింగే రాహువులెందరో
చీకటి కథల మాటున విషపు గాట్లెన్నో
కలలు కనే సమయమేది కష్టజీవులకు

మనుషులొకటైనా భేదాలు తొలగేదపుడో
మారని బతుకులలో దీపాలు వెలిగెదెన్నడో
కరుణలేని వైఖరులలో 
సమ్మతి పూల పరిమళాలెపుడు వీచేనో

హే మహాత్మా
హే భగవాన్
హే మాలిక్

కఠినాత్ముల కర్కశ హృదయాల్లో
జాలిగొలిపే జాబిలి మనసులు పూయించవూ
కౄరచేష్టల మనుషుల్లో
ఆర్తి దీపాలు వెలిగించవూ

తండ్రీ
శోకనివారకా 
నీ కరుణామృత చూపులతో
నీ ఉదయ రాగాలలో జీవితం పండించూ
నీవే కల్లోల హృదయాలకు అమృత లేపనం అందించూ

ఏడెల్లి రాములు ✍️
ది*01*09*2021(21*07)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
8
[01/09, 9:18 pm] Korada: కవితాగానం 
        🎻జీవనరాగం🎻 
     కోరాడ నరసింహా రావు 
      * నీ వానందించుము * 
    🎼🎼🎼🎼🎼🎼🎼
సప్తస్వర సంగీత సాధనే... 
ఈ మానవ జీవనము... !
వివిధ రాగాల సమ్మిశ్రీతము గ 
సాగుతున్నదీ జీవితం... !!

నవరసమ్ములను మేళవించు కుని జన్మమెత్తినాడు జీవుడు జన్మమెత్తినాడు.... !
తన బ్రతుకు వీణ పై మ్రోగు రాగముల ననుభవించునేడు!
సాగిపోవు ఈ జీవనరాగము నా స్వాదించుచు నున్నా డు !!
 
బ్రతుకును విషాదాలాపనల 
దరిజేరనీక... శాంత,శృంగార 
హాస్యానంద రాగములనే  నీ 
వాలపించాలి ! కఠోర సాధనజేయకనే  ఇది  సాధ్యము కాదురా ... !!

మానవతా విలువలనెరిగి.... 
ఈ మనిషిజన్మ పరమార్ధము దెలుసుకు... నీ జీవన సంగీ తమును నేర్చుము !
మధురాలాపనలతో... జీవించుచు ఇతరుల కానందము నొసగి... 
నీ వానందించుమురా .... !!
       ****************
       ....... కోరాడ.
9.
[02/09, 8:05 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్‌ 2 )
2/9/2021/ గురువారము
అ0శం:- " జీవనరాగం "

సీ!  జీవునిపుట్టుకే  జీవనరాగము
తెలియనానందము  తేలియాడు

బాధ్యతలెన్నియో  బ్రతుకునందుండును
సాగినంతవరకు  సాగుచుండు

సుఖ దు:ఖములనగ  చుట్టపుచూపుగ
చూచిపోవుచునుండు  చింతయేల

చిగురించుఆశలు  చిగురంటనుండవు
పండినఆకులు  పడునునేల

ఆ!  మానవతను మరువ  మనుజులకు తగదు
నిండుజీవమంత  నిలుపు మహిని
జీవి మనుగడంత  జీవనరాగమై
జగతి వెలుగు నింపు  జనులుమెచ్చు!
             తరణికంటి సూర్యలక్ష్మి.
10
                        ------------
[02/09, 8:12 pm] Korada: కవితాగానం 
        🎻జీవనరాగం🎻 
     కోరాడ నరసింహా రావు 
      * నీ వానందించుము * 
    🎼🎼🎼🎼🎼🎼🎼
సప్తస్వర సంగీత సాధనే... 
ఈ మానవ జీవనము... !
వివిధ రాగాల సమ్మిశ్రీతము గ 
సాగుతున్నదీ జీవితం... !!

నవరసమ్ములను మేళవించు కుని జన్మమెత్తినాడు జీవుడు జన్మమెత్తినాడు.... !
తన బ్రతుకు వీణ పై మ్రోగు రాగముల ననుభవించునేడు!
సాగిపోవు ఈ జీవనరాగము నా స్వాదించుచు నున్నా డు !!
 
బ్రతుకును విషాదాలాపనల 
దరిజేరనీక... శాంత,శృంగార 
హాస్యానంద రాగములనే  నీ 
వాలపించాలి ! కఠోర సాధనజేయకనే  ఇది  సాధ్యము కాదురా ... !!

మానవతా విలువలనెరిగి.... 
ఈ మనిషిజన్మ పరమార్ధము దెలుసుకు... నీ జీవన సంగీ తమును నేర్చుము !
మధురాలాపనలతో... జీవించుచు ఇతరుల కానందము నొసగి... 
నీ వానందించుమురా .... !!
       ****************
       ....... కోరాడ.
11
[02/09, 8:42 pm] Kavita Venkateshwarlu Garu: కవితా గానం సీజన్ - 2
అంశం:: జీవనరాగం
శీర్షిక:: రాగలాపన నా కోరిక

జీవితం క్షణభంగురం
తిరిగే బొంగరం
ఎప్పుడు అగుతుందో తెలియని వరం
అంతా తెలుసుననే అహంకారం

బంధుత్వాలు బంధనాలు
జీవిత చక్రానికి ఇంధనాలు
నడిపించే సువాసన సుగంధాలు
జీవన మకరందాలు

కళ్యాణరాగం కమనీయమై
మోహనరాగం ముదమోదమై
మురళీగానం ఆనందపరవశమై
అందరి జీవితాలు సంతోష సంబరమై

కష్టాలు లేని సుఖాలతో
విఘ్నాలు లేని ఆనందాలతో
బాధలు లేని భాగ్యాలతో
వేదనలు లేని వేకువలతో

ఎక్కడ చూస్తే అక్కడ పచ్చదనం
ఎటు చూస్తే అటు వెచ్చదనం
కరువులు లేని కమ్మదనం
అరువులు లేని ఆనందనందనం

అందరి మోములు కళకళ లాడాలి
అందరి బ్రతుకులు హాయిగుండాలి
కులమతాలు విడనాడాలి
ఒకే కుటుంబంలా కలిసిమెలిసి
ఉండాలి
మనస్పర్థలు లేక మంచిగుండాలి
అన్న దమ్ముల్లా ఆనందంగా
జీవించాలి!!
అదే నా కోరిక
ప్రతి జీవికి కావాలదే వేడుక!!
                  కవిత వేంకటేశ్వర్లు
                  కర్నూలు
                  8309920625
పై కవితా నా స్వీయ రచన అని
హామీ
12
[02/09, 8:44 pm] దారల విజయ కుమారి Poetess: కవితా గానం సీసన్ 2
అంశం : జీవన రాగాలు
శీర్షిక : బేతాళ
************

దేహం చెట్టు 
ఎప్పుడూ కళకళ లాడుతుంది

మనసు చేతులు చాచినపుడు
కాసిన్ని
ప్రేమ చిలకరింపులు..
కాసింత అక్కర..అంతే
జీవితాలను విరబూస్తుంది..

ఆ గుబురుల్లో గూళ్ళు కట్టుకుంటాయ్
అనుభూతుల పిట్టలు 
గుడ్లుపెట్టి..పొదుగుతూ..
తరాలను విస్తరించుకుంటూ..

నోట్లో భావాల గింజలను కుక్కినంత సేపే
లేత రెక్కల్లో ధైర్యం నింపుకున్నంత సేపే..
దూరాలకు ఎగిరిపోతుంటాయి

ఎగరలేని
దేహం మాత్రం అక్కడే

అనుభవాలు..
తీపి వన్నీ పొదుపుకుని
చేదు వన్నీ.. విసిరేసినా
మళ్ళీ ఎత్తుకుని
ఏ పై కొమ్మల మీదో
దిట్టంగా కూచుంటాయి

ఊహలేమో ఊయలలూగుతూ
కలలను నిర్మిస్తుంటాయి

గాలి వాటుకు కొట్టుకొచ్చిన
ఏ ప్రేరణా పుప్పొడికో
భావాలు మళ్ళీ చిగురేసి..పువ్వేసి..

అందుకేనేమో.. ఆ జీవనం లోకి 
ఏ అనుబంధపు కోయిలొచ్చినా
పరిమళ రాగాలను పాడుతూనే ఉంటుంది

దారల విజయ కుమారి
13
[02/09, 8:52 pm] +91 96528 32290: కవితా గానం (సీజన్ 2)  


అంశం: జీవన రాగం  
పేరు : గొర్రెపాటి శ్రీను
శీర్షిక :  ఆమె                               *************************

ఆమె
అగ్ని సాక్షిగా మూడుముళ్ళబంధంతో
కట్టుకున్న భర్తతో కలసి ఏడడుగులు వేస్తుంది !
ఆమె
మెట్టినిల్లు సిరిసంపదలతో తులతూగేలా
సకల సౌభాగ్యాలతో వర్థిల్లేలా
మహరాణి తానై వెలుగులు పంచుతుంది !

ఆమె
తన సత్ ప్రవర్తనతో
పుట్టింటి గౌరవాన్ని అత్తింట నిలబెడుతూ
అత్తింటికి వంశవారసత్వన్ని ప్రసాదిస్తూ
అందరికీ తానే లోకమవ్వగా
మూర్తీభవించిన మంచితనమవుతుంది !

ఆమె
బ్రతుకు జీవన రాగానికి ఆమని తానై
అంబరాలనంటే సంబరాలను పరిచయం చేస్తుంది !

"ఏడడుగులతో ప్రారంభమైన జీవనసాహచర్యం
ఏడుజన్మల దాకా కొనసాగాలని "
ప్రతి పురుషుడు కోరుకునేలా...
చేసే ఘనత ఆమెకే స్వంతం !

అందమైన ,ఆనందకరమైన జీవితానికి అర్థం దాంపత్యబంధం అనుకునేలా
పురుషుడి విజయానికి తోడై నీడై
ఎలాంటి పరిస్థితులలోనైనా వెన్నంటి వుంటూ
ఆత్మవిశ్వాసాన్ని అందిస్తూ .. నిలబడే జీవనసహచరి...ఆమె !

                                                     రచన : గొర్రెపాటి శ్రీనుు
14.
[02/09, 9:33 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:02-09-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: జీవన రాగం
*********************
నీ మాట స్పర్శ తగలగానే 
నేనో హర్షాతిరేకంతో కురిసే మేఘాన్ని అవుతాను..

నీ సాన్నిధ్యంలో గడిపిన క్షణం 
నేనో పున్నమి కాంతులలో
కనులు విప్పిన
ముగ్ధమోహన కలువబాలను అవుతాను

నీ చిరునవ్వుల కిరణాలు  సోకగానే
శతపత్ర కమలలోచనినై
మధుర భావనలలో మునిగి పోతాను...

 అనురాగంతో నన్ను అల్లుకున్న మరు నిమిషం
నేనో  వాసంతికనై మురిసిపోతాను..

ఆంక్షలకు కట్టబడని మన బంధం
అపోహలకు తావులేకుండా
కాల వీణపై
సంతసాల స్వరాలను ఒలికిస్తూ
పలికే జీవన రాగం
మన ఇరు హృదయాలను ఒకటిగా నడిపించే  
అందమైన ప్రస్థానం అవుతుంది...

 *వురిమళ్ల సునంద,ఖమ్మం*
15
[03/09, 7:51 pm] Aalla Nageshwar Rao Poet: అంశం; జీవనరాగం
శీర్షిక:
     ""  మా  ' నవ'  జీవనరాగం "

సప్తస్వరాలు కలిస్తే
సంగీత రాగాలాపానం
సుఖదుఃఖాల సమ్మిళితమే
మానవ  జీవనరాగం!
నిత్యసాధనా దీక్షతో
సంగీత స్వరార్చన చేయవచ్చు
సహృదయ సౌశీల్యం తో
జీవనరాగం ఆలపించవచ్చు!
పిన్నల  అభిరుచులను తెలుసుకుంటూ
పెద్దల సలహాలను స్వీకరిస్తూ
వాళ్ళ అనుభవాల సారాలను ఆకళింపు చేసుకుంటూ
పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించు కుంటూ
ఆప్యాయతానురాగాలను పంచుకుంటూ
కష్టనష్టాలకు సమంగా బాధ్యత వహిస్తూ
పొదుపు మంత్రాన్ని పాటిస్తూ
కోపతాపాలను అదుపులో ఉంచుకుంటూ
కుటుంబ సభ్యులందరూ సద్భావంతో
ముందడుగు వేసిననాడు
పలుకును మా  "" నవ "" జీవనరాగం!
..........................................
రచన
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్.....రాష్ట్రం
చరవాని సంఖ్య: 7416638823
...........................................
పై వచనకవిత నా  స్వీయారచనేనని హామీఇస్తున్నాను.
16
[03/09, 8:16 pm] +91 90594 38068: అంశం: జీవనరాగం 
శీర్షిక: మధుర గానం 
...
మనిషి జీవనగమనంలో 
ఎన్నో దశలు 
శిశువు దశలో 
కేరింతల రాగం 

అమ్మ ఒడిలో 
అనురాగ రాగం 
నాన్న పెంపంకంలో 
క్రమశిక్షణ రాగం 

అన్నయ్య, అక్కయ్య 
ప్రేమలో ఆత్మీయ రాగం 
స్నేహితులు, బంధువులు 
చూపించే ప్రేమ రాగం 
గురువుల బోధనలో 
చదువుల కమ్మటి రాగం 

జీవన సహచరి అందించే 
ప్రేమ జల్లులలో 
మమతానురాగాల రాగం 
జీవితమంతా 
సంగీత సరిగమల లయలతో 
సుమధురంగా ఆలపించే 
జీవన రాగం 
...
ఇది నా స్వీయ రచన 
...
గజవెళ్ళి శ్రీనివాసాచారి కాజీపేట


Comments

Popular posts from this blog

Kavitaganam(1 to 20)

Kavitaganam (71 to 100)